Chandrababu: ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం- చంద్రబాబు
Chandrababu: ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.;
Chandrababu: ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై.. నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలన్నారు చంద్రబాబు.