ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే బీజేపీ పెద్ధలతో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది. అటు నుంచే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెలుతారని తెలుస్తోంది. తిరుగుప్రయాణంలో మహారాష్ట్రలో తెలుగువాళ్లు ఉండే ఏరియాలో ఎన్డీయే తరఫున ప్రచారం నిర్వహించి అమరావతికి తిరిగి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.