కరోనా వారియర్స్‌తో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు.. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదన్నారు..;
కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు.. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదన్నారు.. కరోనాతో ప్రజల్లో మానసిక ఆందోళన పెరిగిందని..మానవతా దృక్పథంతో వారికి సాయం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.. కరోనా వారియర్స్‌తో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. పది మందిలో మనం ఆదర్శంగా నిలబడాలని కరోనా వారియర్స్‌కు సూచించారు.