YS Jagan : జడ్జినే రప్పా రప్పా.. జగన్ ఏంటిది..?

Update: 2025-11-21 14:13 GMT

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా సరే పెద్ద హడావిడి చేయడం కామన్ అయిపోయింది. జగన్ ఎక్కడికైనా వస్తున్నాడు అంటే ఏపీ పోలీసులకు పెద్ద టెన్షన్ గా మారిన పరిస్థితి తెలిసిందే. ఆయన హడావిడి వల్ల ఎవరి మీద కారు ఎక్కిస్తారు అని, ఎవరి మీద దాడులు చేస్తారో అని, ఎవరు చనిపోతారో అనే భయం పోలీసులకు పట్టుకుంది. ఎందుకంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి అరాచకాలు మనం కామన్ గానే చూస్తున్నాం. ఇక నిన్న తెలంగాణలో సీబీఐ కోర్టు ముందు విచారణకు వచ్చిన జగన్ ఏ స్థాయి హంగామా చేశారో చూశాం. తన బిల్డప్ ల కోసం ఏకంగా ఏపీ నుంచి తన వైసిపి పెయిడ్ బ్యాచ్ ను రప్పించుకున్నారు.

అయితే ఇక్కడ కూడా వైసిపి బ్యాచ్ రప్ప రప్ప నినాదాలు, పోస్టర్లతో భయానక వాతావరణం క్రియేట్ చేసింది. అది చూసిన హైదరాబాద్ ప్రజలు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ జగన్ బ్యాచ్ తమ మీద దాడులు చేస్తుందో అని భయపడిపోయారు. అసలు ఏంటి రప్ప రప్ప.. ఎక్కడికి వెళ్లినా ఇదే దిక్కుమాలిన ప్రచారమా అంటున్నారు ప్రజలు. ఎందుకంటే జగన్ రైతులను పరామర్శించడానికి వెళ్లినా.. ఎక్కడైనా చావులకు వెళ్లినా ఈ రప్పా రప్పా అని కామెంట్లు నినాదాలు మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా కోర్టులో కూడా ఇదే దిక్కుమాలిన నినాదాలు ఏంటి. ఎవరిని రప్ప రప్ప నరికిస్తారు. జగన్ ను విచారణకు పిలిచిన సిబిఐ అధికారులను నరికేస్తారా.. లేదంటే ఏకంగా జడ్జిని రప్ప రప్ప అంటారా.

ఈ స్థాయి అరాచకాలు ఏంటని నేటిజెన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే జగన్ బ్యాచ్ చేస్తున్న దారుణాలు ఇలాంటివి మరి. వీళ్ళ అధికారం పోయి అంత ఏడాదిన్నర మాత్రమే అవుతోంది అప్పుడే రఫ్బర్ నరికేస్తాం అంటున్నారు ఒకవేళ అధికారం ఇస్తే నిజంగానే రోడ్లమీద ఇలాగే నరికేస్తారేమో అని ఏపీ ప్రజలు తెగ భయపడిపోతున్నారు. ఇలాంటి నినాదాలు వల్ల జగన్ కే డ్యామేజ్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అధికారం ఏపీ ప్రజలు ఇవ్వరు అనేది గుర్తుంచుకోవాలి.


Full View

Tags:    

Similar News