ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఘరానా మోసం బయటపడింది. చిల్లకల్లు పీఎస్ పరిధిలో చీటీ డబ్బులు రాక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న కేసును చేధించే క్రమంలో పోలీసులకు మరో ట్విస్ట్ చిక్కింది. విచారణ చేపట్టిన పోలీసులకు చిల్లకల్లు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇద్దరు చీటీలు కట్టించుకోవడం వెలుగులోకి వచ్చింది. చీటీలు కట్టిన పలువురికి డబ్బులు ఎగ్గొట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు పలువురు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇద్దరు మొత్తం 5కోట్ల రూపాయల నగదును చీటీల వల్ల నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జానకిరాముడు నష్టపోయిన బాధితులకు చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అన్యాయం జరిగిన బాధితులు ఫిర్యాదు చేయాలని సూచించారు..