Chittoor : రోడ్డుపై ఏనుగుల గుంపు
పలమనేరు - గుడియాత్తం రహదారిపై తిష్ట వేసాయి. రద్దీగా ఉండే రోడ్డుపై ఏనుగులు నిలబడడంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది;
చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. పలమనేరు - గుడియాత్తం రహదారిపై తిష్ట వేసాయి. రద్దీగా ఉండే రోడ్డుపై ఏనుగులు నిలబడడంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటకు పైగా ఏనుగుల గుంపు అక్కడే ఉండండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి వరకు ఖాళీ ఉన్న రోడ్డుపైకి ఒక్కసారిగా ఏనుగుల మంద రావడంతో.. ప్రయాణికులు, వాహనదారులు పరుగులు తీశారు.
స్థానికుల సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న అటవీఅధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచూ ఏనుగులు రోడ్డుపైకి రావడంతో బిక్కుబిక్కు మంటూ ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.