కృష్ణా జిల్లా ఉయ్యూరులో రెండు కార్మిక ముఠాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక ముఠాకి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు నుంచి గ్రానైట్ అన్‌లోడ్ చేయడానికి వచ్చిన ముఠా కార్మికులపై స్థానిక ఉయ్యూరుకు చెందిన పెద్ద ముఠా రౌడీయిజానికి దిగింది. ఇది తమ ఏరియా అని... ఇక్కడ ఏదైనా తామే అన్‌లోడ్ చేయాలంటూ పెద్ద ముఠా కూలీలు హెచ్చరించారు. అక్కడికి వచ్చిన కూలీలతో ఘర్షణకు దిగారు. కూలీలను చితకబాదారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో బాధితులకు చికిత్స అందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఉయ్యూరు టౌన్ పోలీసులు సేకరిస్తున్నారు.