Chandrababu Naidu : నేడు మాచర్లకు సీఎం చంద్రబాబు

Update: 2025-09-20 07:15 GMT

నేడు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.10.30 గం.కు మాచర్లకు చేరుకుని స్థానిక చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టనున్నారు. హెల్త్ క్యాంపులో సఫాయి కర్మచారీలతో మాట్లాడనున్నారు. మున్సిపాల్టీలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు రూ.2 కోట్ల చెక్కు అందించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సన్మానించనున్నారు. ఇక, ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు దిశనిర్ధేశం చేసే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే, మాచర్లలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ పర్యటనతో పల్నాడు జిల్లాలో ప్రజలకు మరోసారి శుభ్రతా ప్రాముఖ్యత, ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా అవగాహన కానుంది.

Tags:    

Similar News