Chandrababu Naidu : ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త

Update: 2025-09-20 07:59 GMT

ఏపీ సీఎం చంద్రబాబు ఉల్లి రైతులకు శుభవార్త చెప్పారు. హెక్టారుకు రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైతుల సమస్యపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.100 కోట్ల మేర అదనపు భారం భరించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు రూ.100 కోట్లు అదనపు భారం పడనుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో ఈ మధ్య రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కొందరైతే.. మార్కెట్ యార్డుల్లోనే ఉల్లిని వదిలేసి వెళ్లిపోయారు. ఏమాత్రం గిట్టుబాటు కానీ ధర ప్రకటిస్తే.. ఇక ఎందుకు అని వారు ఆవేదన చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కేజీ ఉల్లి ధర రూ.2 నుంచి రూ.5కి పడిపోయింది. చిత్రమేంటంటే.. చాలా చోట్ల వ్యాపారులు ఉల్లి ధరలను తగ్గించట్లేదు. అటు రైతులు, ఇటు కొనుగోలుదారులకు లాభం కనిపించట్లేదు. మధ్యలో వ్యాపారులు మాత్రం భారీ లాభాలు పొందుతున్నారనే విమర్శలున్నాయి.

Tags:    

Similar News