Chandrababu Naidu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన SLBC మీటింగ్

Update: 2026-01-23 08:30 GMT

సీఎం నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజులపాటు దావోస్ లో పర్యటించి ఏపీకి చేరుకున్నారు. వచ్చి రాగానే కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా ఎస్ ఎల్ బి సి సమావేశానికి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 233, 234వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల మీటింగ్ జరుగుతోంది. వార్షిక రుణ ప్రణాళిక అమలు మీద అలాగే ఎంఎస్ ఎంఈలు, వ్యవసాయ రుణాల మీద సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా అనుబంధ రంగాలకు 2.96 లక్షల కోట్ల మేర రుణాలు ఇప్పటికే బ్యాంకులు ఇచ్చాయి. అలాగే కౌలు రైతులకు రూ.1490 కోట్ల మేర రుణాలు కూడా అందజేశాయి. అటు ఎంఎస్ ఎంఈలకు కూడా రూ.95714 కోట్ల మేరకు రుణాలు అందజేశాయి బ్యాంకులు.

ఇలా బ్యాంకులు అందజేసిన రుణాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలు, అమరావతిలో ఫైనాన్షియల్ హబ్ చేసే అంశము, రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ అంశంతో పాటు డ్వాక్రా సంఘాల లింకేజీ, ఏపీలో స్టార్టప్ లకు ఫైనాన్షియల్ సపోర్ట్ లాంటి సుదీర్ఘ అంశాల మీద సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంకర్లతో చర్చిస్తున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సి ఎస్ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండి, ఆర్.బి.ఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డ్ జిఎం తో పాటు వివిధ బ్యాకులకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

Tags:    

Similar News