వర్షాకలం వస్తే 8 గ్రామాలకు నరకమే. ఏరు పొంగితే రాకపోకలు బంద్ అవుతాయి. వైసీపీ హయాంలో అధికారులు, మంత్రుల చుట్టూ ఈ ఎనిమిది గ్రామాల ప్రజలు తిరిగినా సరే వారిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామాల సమస్యలకు పరిష్కారం చూపించారు. గజపతి నగరం, మెంటాడ మండలంలోని సిడగం వలస, రాయవలస, ఎర్రోడు వలస, ఏనుగుల వలస, మెంటాడ మండలం ఆగూరు పంచాయతీ పరిధి మల్లేడు వలస, సారాడ వలస, సంగం గుడ్డి వలస గ్రామాల ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ గ్రామాల ప్రజలు బయటకు రావాలంటేనే నరకయాతన అనుభవించుతున్నారు. ఈ గ్రామాల ప్రజలందరూ చెంపవతి నది దాటాలంటే రెండు జతల బట్టలు చేతుల్లో పట్టుకుని వెళ్లాల్సిందే.
ఈ ఎనిమిది గ్రామాల్లో 1500 మంది ప్రజలు ఉన్నారు. ఈ గ్రామాల ప్రజలు బయటకు వెళ్లాలన్నా.. విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే దత్తి గ్రామంలో సీఎం చంద్రబాబు పింఛన్ల పండుగ కార్యక్రమానికి వచ్చారు. అక్కడే ఈ 8 గ్రామాల ప్రజల సమస్యలపై కీలక హామీ ఇచ్చారు. కచ్చితంగా చెంపావతి నదిపై బ్రిడ్జి కట్టిస్తానని చెప్పారు. రూ.6.5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనిపై సీఎంవో నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ నియోజకవర్గం నుంచే కొండపల్లి శ్రీనివాస్ గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.
ఆయన నుంచి విజ్ఞప్తి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఈ గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకుని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. వారి కష్టాలను యుద్ధ ప్రాతిపదికన తీర్చాలని.. ఆ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పారు. అందుకు అవసరం అయిన నిధులను మంజూరు చేస్తామన్నారు. విద్యార్థుల చదవులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఈ 8 గ్రామాల ప్రజలు సీఎం చంద్రబాబు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల బాధలకు ఇప్పుడు పరిష్కారం దొరికిందని అంటున్నారు.