ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు హెచ్చరిస్తున్నా..అందుకు అధికార పార్టీకి చెందిన పార్టీ నేతలు మాత్రం హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. జనవరి ఫస్ట్ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇచ్చార్జ్ ఎస్‌విఎస్ వర్మ కోడిపందాలు నిర్వహించారు. నూతన సంవత్సర వేళ కోడిపుంజులు తీసుకువచ్చి పందాలు ఆడారు. వర్మ ఇలా కోడిపందాలు ఆడించడంతో సంక్రాంతి మూడు రోజులు ఇక ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు అని జూదంరాయులు చెబుతున్నారు. అంతేకాదు పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు రక్షించాలంటూ కోడిపందాల కోసం ఆయన పిలుపునిచ్చారు. అధికార పార్టీలో ఉండి వర్మ కోడిపందాలు నిర్వహిస్తుండటంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.