జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భీమిలి జనసేన ఇన్చార్జి పంచకర్ల నాగ సందీప్,పార్టీ నాయకులు సీఐ.బి. తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగ సందీప్ మాట్లాడుతూ... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అలానే మహిళలపై మార్పుడు ఫొటోస్,అసభ్య వీడియోలు ఫోటోలు పెట్టి సామాజిక మద్యాలలో వైసిపి చెందిన కొంతమంది నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గత కొద్దిరోజుల క్రితం శ్రీకాళహస్తి లో జనసేన ఇన్చార్జ్ ఉన్న మహిళ నాయకురాలు డ్రైవర్ హత్య చేశారని నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో హత్య వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని అందుకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. ఇలాంటి తప్పుడు రాతలు,తప్పుడు చేష్టలు మానుకుంటే మంచిదని ఈ సందర్భంగా హెచ్చరించారు. గతంలో భీమిలి ప్రాంతంలో జరిగిన సిద్ధం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, నాయుడు,పవన్ కళ్యాణ్ పొంతనలేని బొమ్మలు పెట్టి అవహేళన చేశారని గుర్తు చేశారు.
భీమిలి నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకుడు సోషల్ మీడియా ప్రచార వ్యక్తి లోలాకుల.చార్యులు పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టడం సరికాదని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. గతంలో ఈయన ఓ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ కి వెళ్ళాడన్నారు. ఈయనకు మార్కుడు వీడియోలు ఎలా వస్తున్నాయి ఎవరు పంపిస్తున్నారన్నారు. భీమిలి పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి ఇటువంటి వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని చెప్పారు.