ఏపీ రాజధాని అమరావతి పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరుగున పడ్డ పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. వైసిపి హయాంలో మూడు రాజధానులు అంటూ ఏపీని సర్వనాశనం చేసింది. 2014- 19 మధ్యలో సీఎం చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్న అమరావతి పనులను వైసీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆపేసి.. ఏపీకి రాజధాని అంటూ లేకుండా చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించి శరవేగంగా పనులు చేస్తుంది. ఇప్పటికే 4000 కోట్లతో నిర్మించిన సిఆర్ డిఏ భవనం ప్రారంభమైంది. ఇంకోవైపు ఐకానిక్ టవర్స్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇందులో రెండు టవర్స్ పూర్తి కావడానికి వచ్చాయి. వాటిని ఎల్ అండ్ టి కంపెనీ నిర్మిస్తోంది. ఇంకో రెండు ఐకానిక్ టవర్స్ ను షాపూర్ పల్లోంజి అనే సంస్థ నిర్మిస్తోంది. ఐదో టవర్ ను ఎన్సిసి సంస్థ నిర్మిస్తోంది.
ఇక హెచ్వోడీల కోసం 50 అంతస్తుల బిల్డింగును స్పీడుగా నిర్మిస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు నాయుడు కోసం హెలీ ప్యాడ్ ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఐదేళ్లపాటు నీళ్లలో నానినా సరే ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఈ నిర్మాణాలను చేపడుతుంది ఎల్ అండ్ టి సంస్థ. కాగా వైసిపి హయాంలో ఎక్కడి పనులు అక్కడ మధ్యలోనే ఆగిపోవడంతో.. చాలావరకు మెటీరియల్ పాడైపోయింది. ఐదేళ్లపాటు ఆగిపోవడం వల్ల స్టీల్ చాలావరకు డ్యామేజ్ అయింది. దీంతో ఇప్పుడు పాడైపోయిన స్టీల్ ను తొలగించి కొత్త స్టిల్ ను ఏర్పాటు చేస్తున్నారు.
వైసిపి ప్రభుత్వం తమను ఎలాంటి పనులు చేయనివ్వలేదని సదురు కంపెనీలే స్వయంగా చెబుతున్నాయి. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అప్పగించిన పనులను కంప్లీట్ చేయాలంటూ సూచించడంతో.. స్పీడ్ గా పనులు చేస్తున్నామని కాంట్రాక్టులు పట్టుకున్న కంపెనీలు చెబుతున్నాయి. ఈ పనులన్నీ రాబోయే రెండేళ్లలో కంప్లీట్ అవుతాయని.. అప్పుడు పరిపాలన ఇక్కడ నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే రాబోయే మూడున్నర ఏళ్లలో అమరావతి దాదాపు పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీలకు ఇచ్చిన డెవలప్మెంట్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఇంకోవైపు హైవేలు, 50 ఫీట్ల రోడ్లు కంప్లీట్ అయ్యాయి. రైల్వే జోన్ కోసం చివరి పనులు నడుస్తున్నాయి. ట్రాన్స్ పోర్ట్, ఎక్వైప్ మెంట్ కంప్లీట్ అయితే అమరావతి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి వారం అమరావతి పనులపై సమీక్ష చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే అమరావతి అనుకున్న స్థాయిలో పూర్తి కావాలని ఆరాటపడుతున్నారు.