AP News: ప్రభుత్వానికి తలనొప్పిగా సమ్మె సైరన్

నిన్న అంగన్వాడీ , ఇకపై కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్స్‌ సిబ్బంది;

Update: 2023-12-25 07:00 GMT

అంగన్వాడీల నిరవదిక సమ్మెలో భాగంగా ఆదివారం 13వ రోజున మదనపల్లె ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చెవి లో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపిన వారు మాట్లాడుతూ దాదా పు రెండు వారాలుగా తాము సమ్మె చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరమన్నారు. ఇలా మొండి వైఖరితో వెళితే తాము కూడా అదే వైఖరి అవలంభించాల్సి ఉంటుందన్నారు. తాళా లు పగులకొట్టి అంగన్వాడీ సెంటర్లను తెరచినంత మాత్రాన చిన్నారు లను సెంటర్లకు తీసుకెళ్లలేకపోయారన్నారు. 

ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్స్‌ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీళ్లంతా రోడ్డు ఎక్కుతున్నారు.  ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతున్న టైంలో రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీని కలవర పెడుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్కరుగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలు తమ డిమాండ్ పూర్తిగా నెరవేర్చే వరకు తగ్గేదేలే అంటున్నారు.


వీళ్లకు ఇప్పుడు మిగతా శాఖల కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా జత కలవబోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో వివిధ వర్గాలకు హామీలు ఇచ్చారు. వాటినే అమలు చేయాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. అలా డిమాండ్ చేస్తూ రోడ్డు ఎక్కిన వారిలో ముందు వరసలో ఉన్నారు అంగన్వా డీ వారిని చూసి ఇప్పుడు సమగ్ర శిక్ష సిబ్బంది కూడా ఆందోళన బాటపడుతోంది.  గతంలో ఉపాధ్యాయులు చలో విజయవాడ పిలుపునిస్తే ఉక్కుపాదంలో అణిచవేసింది ప్రభుత్వం. ఇప్పుడు అంగన్వాడీల ఆందోళనలను కూడా అదే మాదిరిగా చల్లార్చాలని ప్రయత్నించి విఫలమైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో వారిపై దుందుడుకు చర్యలు కూడా తీసుకోలేకపోతోంది. ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్న మిగతా విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగిస్తున్నారు. 

Tags:    

Similar News