కరోనా బారిన పడ్డ వైసీపీ ముఖ్యనేతలు
వైసీపీ ముఖ్యనేతలు కరోనాతో ఆస్పత్రిపాలయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో ఆయన్ను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో..;
వైసీపీ ముఖ్యనేతలు కరోనాతో ఆస్పత్రిపాలయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో ఆయన్ను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే మంత్రి కరోనా నుంచి కోలుకున్నారు. ఇంతలోనే మళ్లీ తిరగబెట్టడంతో ఆయన్ను హైదరాబాద్‌కి షిఫ్ట్ చేశారు. సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పాల్గొన్న తర్వాత వెల్లంపల్లికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
సెప్టెంబర్ 25 తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నా కోలుకోవడంతో ఇంటికి వెళ్లారు. తీరా మళ్లీ వైరస్ తిరగబెట్టడంతో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌కి తరలించారు. అటు, TTD ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన కూడా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు చెప్తున్నారు.