CPI state secretary Ramakrishna : సోమువీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

CPI state secretary Ramakrishna : బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానని హామీ ఇవ్వడమేంటని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు.

Update: 2021-12-29 08:49 GMT

CPI state secretary Ramakrishna : సోమువీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణఏపీ బీజీపీ అధ్యక్షుడు సోమువీర్రాజుకు మతిభ్రమించినట్లుంది అంటూ కామెంట్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సోమువీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా పిలవాలేమో అంటూ విమర్శించారు.

కోటి మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పడం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్‌ను కారుచౌకగా అందిస్తానని వ్యాఖ్యానించడం దుర్మార్గం అన్నారు. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే.. బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానని హామీ ఇవ్వడమేంటని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు.

Tags:    

Similar News