Andhra Pradesh : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..!
Andhra Pradesh : రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ మరోసారి కర్ఫ్యూని పొడిగించింది. జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.;
Andhra Pradesh : రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ మరోసారి కర్ఫ్యూని పొడిగించింది. జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ సడలింపులను అలాగే కొనసాగించనున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5న పగటి కర్ఫ్యూని అమల్లోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వరకూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే కరోనా అదుపులోకి రాకపోవడంతో ఈ నెలాఖరుకు వరకూ పొడిగించిన విషయం తెలిసిందే..తాజాగా మరోసారి కర్ఫ్యూని పొడిగించింది ప్రభుత్వం.