Road Accident : ట్రాక్టర్ను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరు యువకుల దుర్మరణం

Update: 2025-09-05 12:30 GMT

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామం వద్ద నిన్న అర్ధ రాత్రి ట్రాక్టరు డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా నా చపల్లి గ్రామానికి చెందిన 11 మంది నిన్న అర్ధ రాత్రి దాటాక జోగులాంబ గద్వాల జిల్లా ఇటి క్యాల మండలం బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అనంతరం ఇంటికి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రంగాపురం గ్రామ శివారులోకి రాగానే ట్రాక్టర్ను డీసీఎం వాహనం వెనక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ ఇంజన్ పై డ్రైవర్ పక్కన కూర్చున్న మండ్ల శంకర్ (21), గుప్తా సాయి తేజ (23) కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. విష్ణు, అబ్దు ల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హై దరాబాద్లోని నిమ్కు తరలించారు. డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Tags:    

Similar News