Pawan Kalyan : శాసనసభ వేదికగా పవన్ కీలక వ్యాఖ్యలు

మరో అయిదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలన్న పవన్... ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న డిప్యూటీ సీఎం;

Update: 2024-11-21 04:00 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తనకున్న నమ్మకాన్ని మరోసారి శాసనసభ వేదికగా పవన్ చాటిచెప్పారు. ఐదేళ్లే కాదు, పదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలని.. పాలనలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. ఈ ఐదు సంవత్సరాలు కాదు మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల పరిపాలన పై ఆయన శాసనసభలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి అని చంద్రబాబు నిరూపించారని పేర్కొన్నారు. బుడమేరు వరద సమయంలో ఆయన చూపించిన చొరవ ఎంతో గొప్పది. ఆఫీసులో కూర్చుని ఆదేశాలు ఇవ్వగలిగే సత్తా ఉన్నా కూడా అధికారుల్లో ప్రజల్లో ధైర్యం నింపడానికి బురదలో సైతం దిగారు అని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి శిథిలమై పోయిన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగులు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆలయాల్లో అపవిత్రం, మద్యం దోపిడీలు, వారసత్వంగా వచ్చే అని పేర్కొన్నారు.

అనుభవంతో కూడిన పాలన

అనుభవంతో కూడిన చంద్రబాబు 150 రోజుల పాలన చూశాక.. రాష్ట్ర భవిష్యత్తుపై విశ్వాసం కలిగిందని చెప్పారు. ఆయన ఆదేశిస్తే.. అందుకు అనుగుణంగా అన్ని శాఖల మంత్రులూ పనిచేస్తామని చెప్పారు. ఉచిత ఇసుక అందించడం, మద్యం బెల్టు దుకాణాల నియంత్రణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా.. అందులో తెలుగువారు సగానికి పైగా ఉండటానికి చంద్రబాబు అమలు చేసిన విధానాలే కారణం’ అని ప్రశంసించారు. ‘సంక్షోభ సమయంలో నాయకుడు ఎలా ఉండాలన్నదానికి చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తారు.. విజయవాడ వరదల సమయంలో.. ఆయన స్వయంగా ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు, అధికార యంత్రాంగాన్ని నడిపించిన తీరు అభినందనీయం’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

జగన్ పై విమర్శలు

అనుభవమున్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకు వెళ్లిందని తెలిపారు. గత ప్రభుత్వం పాస్ బుక్‌లో కూడా ముఖ్యమంత్రి ఫోటోలు వేయించుకున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం లో నెల మొదటి రోజున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. 64 లక్షల లబ్ధిదారులకు 4000 చొప్పున పెంచి అందిస్తున్నామన్నారు. బూతులు పోస్ట్ చేసే సోషల్ యాక్టివిటీస్ ల అణచివేతలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత తీసుకున్న కఠినమైన చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే కొనసాగాలని కోరుకున్నట్టు తెలిపారు. 'సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నా, మేం చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలి.. సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తాం.. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం.. ఐదేళ్లు కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలి.. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.. 'అని పవన్ అన్నారు.

Tags:    

Similar News