AP Deputy CM : పవన్ పెద్దమనసు.. గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

Update: 2025-07-31 07:00 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. గిరిజనుల పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఇటీవల మన్యం జిల్లా మక్కువ మండలంలో పలు గిరిజన గ్రామాల్లో సందర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే ఆయా గ్రామాలకు రోడ్డు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.

ఇటీవలే పలు గ్రామాల గిరిజనులకు పాదరక్షలు, పండ్లు పంపించారు పవన్. తాజాగా పవన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన చిలక మెండంగి, తాడిప్యూట్టి, బెండ మొండింగి, డోయువరా బాగుజోల, సిరివర గ్రామాల్లోని 222 కుటుంబాలకు రగ్గులు పంపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ పంపిన రగ్గులను అందుకున్న గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News