AP Politics : సజ్జల వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారా?

Update: 2025-01-26 07:00 GMT

వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పైచేయి వల్లే రాజీనామా చేశారని జరుగుతున్న ప్రచారంపై విజయసాయి రెడ్డి స్పందించారు. ‘నా ప్రాధాన్యం ఎవరూ తగ్గించలేరు. నా కెపాసిటీ నాకు తెలుసు. దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. నా పదవికి న్యాయం చేయగలనని అనిపిస్తే చేస్తానని చెప్తా.. లేదంటే చేయనని చెప్తా. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం చేయగలనని అనుకోవడంలేదు. అందుకే ఎంపీ పదవి నుంచి తప్పుకున్నా’ అని వెల్లడించారు.

రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయలేనన్న ఆలోచనతోనే రాజీనామా చేశానని విజయసాయి స్పష్టం చేశారు. తన కంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతారనే యోచనతో ఎంపీ పదవిని వీడానన్నారు. ఈ విషయాన్ని జగన్‌కు చెబితే, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన చెప్పారని వెల్లడించారు. అయినా తన ఇష్టప్రకారం రాజీనామా చేశానని వివరించారు.

ఇక వివేకా మరణంపై విజయసాయి రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఆరోజు ఉదయం వివేకా చనిపోయారని ఓ విలేఖరి ఫోన్ చేసి చెప్పారు. అది విని షాక్ అయ్యా. సన్నగా, హెల్తీగా ఉండే వ్యక్తి సడెన్‌గా చనిపోవడం ఏంటీ అని ఆశ్చర్యపోయా. అవినాశ్‌కి ఫోన్ చేస్తే ఆయన వేరేవాళ్లకు ఫోన్ ఇచ్చి మాట్లాడించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని ఆ వ్యక్తి నాకు చెప్పారు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను’ అని ఢిల్లీలో చెప్పారు.

Tags:    

Similar News