Visakhapatnam: ఆసుపత్రిలో కరెంటు లేక సెల్ ఫోన్ లైట్లతో డెలివరీ..
Visakhapatnam: ఏపీలో కరెంట్ కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వెళ్తే తెలుస్తుంది.;
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వెళ్తే తెలుస్తుంది. కరెంట్ కోసం ఎదురుచూసి, ఇక వచ్చే పరిస్థితి లేదని తెలిసి, సెల్ ఫోన్ లైట్లతోనే డెలివరీ చేశారు డాక్టర్లు. చివరికి హాస్పిటల్ గదుల్లో గాలి రాకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు బాధ వర్ణనాతీతంగా ఉంది. ప్రాణాలు నిలిపే ఆస్పత్రిలో సైతం కరెంట్ లేకపోవడం ఏంటంటూ ఒక్కో పేషెంట్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం జనరేటర్‌ను బాగుచేసే పరిస్థితి కూడా లేకపోవడంతో.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రోగులు.