Dowry Harassment : ప్రాణం తీసిన వరకట్నం వేధింపులు.. మహిళ అనుమానాస్పద మృతి..

Update: 2025-08-05 06:45 GMT

మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ కాలంలో కూడా వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు. పురుషులతో సమానంగా సంపాదిస్తున్నప్పటికీ ఇంకా వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు. తాజాగా ఏపీ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కట్నం కోసం అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు తనువు చలించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణ జిల్లా మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన శ్రీవిద్యకు కంకిపాడు మండలం కందేరుకు చెందిన అరుణ్ కుమార్ తో ఈ ఏడాది ఏప్రిల్ 23 న వివాహం జరిగింది. శ్రీవిద్య ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండగా.. అరుణ్ కుమార్ సర్వేయర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరి మధ్య పెళ్లి అయినప్పటి నుండి సఖ్యత లేనట్లుగా తెలుస్తోంది. అదనపు కట్నం కోసం భర్త రోజూ తాగొచ్చి కొడుతుండడంతో.. భరించలేని శ్రీ విద్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలను వదలద్దని ఆ లేఖలో రాసింది.

అంతేకాకుండా ఫోన్ చేసి భర్త, అత్త మామలు వేధింపులు భరించలేకపోతున్నానని.. వెంటనే రావాలని తండ్రికి చెప్పింది. తాను వెళ్లేసరికి కూతురు శవమై కనిపించిందని.. తండ్రి బోరున విలపించాడు. కట్నం కోసం తమ అల్లుడే కూతురిని చంపాడని ఆరోపించారు. తమ ఇంటిని అమ్మేసి డబ్బులు ఇవ్వాలని పెళ్లి అయినప్పటి నుండి వేధిస్తున్నాడని.. ఇపుడు తమ కూతురిని లేకుండా చేశారని కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లి సమయంలో 10 లక్షల నగదు తో పాటు 10 లక్షల విలువైన బంగారాన్ని పెట్టినట్లు తెలిపారు. కాగా శ్రీవిద్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags:    

Similar News