DSC: ఏపీలో మరో డీఎస్సీ: మంత్రి నారా లోకేశ్
కార్యకర్తలకు అండగా ఉంటా: లోకేశ్
డీఎస్సీ అభ్యర్థులకు మంత్రి లోకేశ్ గుడ్‌న్యూస్ చెప్పారు. 2026 మార్చిలో డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో టెట్ కండక్ట్ చేస్తామన్నారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్పీ ఉంటుందని పేర్కొన్నారు. గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటు, డీఎస్సీ 2025 ద్వారా 15,941 మంది అభ్యర్థులకు ఇప్పటికే నియామక పత్రాలు అందజేశారు. . యువగళం పాదయాత్ర సమయంలో నిరుద్యోగ యువతతో కలిసినప్పుడు డీఎస్సీ హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేశారని గుర్తు చేశారు. “మగవాళ్లకంటే మహిళలు చదువు చెప్పడంలో ఇంకా సమర్థవంతంగా ఉంటారు. కాబట్టి విద్యా వ్యవస్థలో మహిళలకు మరింత అవకాశాలు కల్పిస్తాం” అని సీఎం అన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా: లోకేశ్
టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు గట్టిగా పోరాడి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని గుర్తుచేశారు. నంబూరి శేషగిరిరావు ఇటీవల గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు లోకేశ్‌ను కలిశారు.
నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక, విద్యా, సామాజిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు అర్బన్‌లోని మైపాడు గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. చిరు వ్యాపారుల ప్రయోజనం కోసం 30 కంటైనర్లతో ఆధునికంగా తీర్చిదిద్దిన 120 షాపులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి వెళతారు. అక్కడ నూతనంగా నిర్మించిన నంద గోకులం లైఫ్ స్కూల్‌ను ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడికి సమీపంలో ఉన్న గోశాలను సందర్శించి, నంది పవర్ ట్రెడ్మిల్ మిషన్‌తో పాటు 'నంద గోకులం సేవ్ ద బుల్' ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారు.