Vizag Earthquake: విశాఖలోని పలు ప్రాంతాల్లో భూకంపం.. దాంతో పాటు పెద్ద శబ్దం..
Vizag Earthquake: విశాఖ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భూమి కంపించడంతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు.;
Vizag Earthquake (tv5news.in)
Vizag Earthquake: విశాఖ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భూమి కంపించడంతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. బాలయ్య శాస్త్రి లే అవుట్, సీతమ్మధార, అల్లిపురం బంగారమ్మ మెట్ట, వేపగుంట పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. పెందుర్తి, సింహాచలంలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురై ఇళ్లలోంచి బయటికి పరిగెత్తారు. ఉదయం 7 గంటల 15 నిమిషాల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీనికి తోడు భారీ శబ్ధాలు వచ్చాయన్నారు. పలు భవనాల పెచ్చులు కూడా ఊడి పడినట్లు తెలుస్తోంది.