AP: ప్రచార హోరుతో మార్మోగుతున్న ఏపీ

ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు... టీడీపీ-జనసేనలో భారీ చేరికలు

Update: 2024-04-30 01:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంతో నియోజకవర్గాలు మార్మోగిపోతున్నాయి. కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైనార్టీల సంక్షేమానికి తూట్లు పొడిచిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఆయన ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి నియోజకవర్గంలోని అమడుగురు గ్రామంలో ప్రచారం చేశారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్ పథకాలను అక్కడి ప్రజలకు వివరించిన సింధూరారెడ్డి... రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వివరించారు.


మడకశిరలో కూటమి అభ్యర్థి M.S. రాజు, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి పార్థసారథితో కలిసి ప్రచారం నిర్వహించారు. ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్‌ చేనేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు... తిరుమలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సునీల్‌ కుమార్‌కు ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. తమ గ్రామంలో ఎన్నికల నిర్వహించొద్దంటూ వేపనపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు.


YSR జిల్లా పులివెందులలో కూటమి అభ్యర్థి బీటెక్‌ రవి సతీమణి లతా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి రవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో సీఎం జగన్‌ సతీమణి భారతి, అవినాష్‌రెడ్డి సతీమణి సమత ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ జగన్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నెల్లూరులోని ఏసీ మార్కెట్‌లో కూటమి అభ్యర్థులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనలో అభివృద్ధి లేక వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని నేతలు ధ్వజమెత్తారు. ఒంగోలులోని 33వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొండపిలో తెలుగుదేశం నారీ భేరి నిర్వహించింది. కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని మహిళా నేతల చెప్పారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల ఆస్తులు కాజేస్తారని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. NTR జిల్లా మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్టప్రసాద్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు నియోజకవర్గంలో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెడ్డిగూడెంలో ప్రచారం చేసిన వసంత సతీమణి శిరీష, కుమారుడు ధీమంత్‌ సాయి ఉపాధి కూలీలతో మాట్లాడారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలంలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్‌ ప్రకటించిన వైకాపా మేనిఫెస్టో అబద్ధాలపుట్ట అని సౌమ్య మండిపడ్డారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలో కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ప్రచారం చేశారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. తిరువూరులోని 20వ వార్డులో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ... సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. కృష్ణా జిల్లా గుడివాడ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము గుడ్లవల్లేరు మండలంలో ప్రచారం చేశారు.

Tags:    

Similar News