AP : మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు.. అందరిలో ఉత్కంఠ

Update: 2024-05-28 07:43 GMT

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, ఆ రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అటు కేంద్రంలో, ఇటు ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థుల్లో బెదురు మొదలైంది. ఎవరెవరిని విజయం వరిస్తుంది, ఎవరికి అపజయం పరిచయం అవుతుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాలి.

ఎన్నికలకు సంబంధించి జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా ఫలితాలను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రకటించాలని సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని సీఈవోలతో వర్చువల్ సమీక్షలో తెలిపారు. కౌంటింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిస్‌ప్లే బోర్డుల ద్వారా కచ్చితమైన ఫలితాలు వెల్లడించాలని చెప్పారు.

కౌంటింగ్ కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్లు చెప్పారు. జూన్ 4న డ్రై డే(మద్యం దుకాణాల మూసివేత)గా ప్రకటిస్తున్నామన్నారు. అవసరమైన చోట 144 సెక్షన్ విధిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్‌లను అభ్యర్థులు/ వారి ప్రతినిధులు రోజుకు 2 సార్లు ఫిజికల్‌గా పరిశీలించుకోవచ్చని తెలిపారు.

జూన్ 4న కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. కౌంటింగ్ రోజు, తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 కంపెనీ బలగాలను కేటాయించామని వివరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News