కష్టాల్లో ఏపీ పరిశ్రమలు

ఏపీ సర్కార్‌ బాదుడుతో వారి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.;

Update: 2023-06-14 10:33 GMT

ఏపీలో పరిశ్రమలు కష్టాల్లో పడ్డాయి.ఏపీలో భారీగా కరెంట్ చార్జీల భారం పడతుండటంతో సంస్థల ఉత్పత్తి ఖర్చులో 70 శాతం కరెంట్ ఖర్చులకే పోతున్నాయి. దీంతో కుంగిపోతున్నాం..వడ్డింపులు ఆపండి అంటూ సర్కార్‌కు కనిపించేలా ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన దుస్టితి ఏర్పడింది.ఏపీలో 39 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉన్నాయి. ఏడాదికి వెయ్యి కోట్లకు పైగా జీఎస్టీ కడుతూ,మూడువేల కోట్ల వరకూ ఏటా విద్యుత్ బిల్లులు కడుతున్నారు అలాగే ఐదు వేల కోట్ల వరకూ విదేశీ మారకద్రవ్యం ఈ పరిశ్రమలు దేశానికి సంపాదించి పెడుతున్నాయి. అయితే ఏపీ సర్కార్‌ బాదుడుతో వారి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తమను ఆదుకోకుంటే జూలై 1 నుంచి ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News