వరద ఉద్ధృతి : 25 గ్రామాలకు రాకపోకలు బంద్

కొద్దిపాటి వరదలకే పోలవరం ప్రాజెక్టు ఎగువను అనేక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి.

Update: 2023-07-21 05:08 GMT

ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ఉద్ధృతి పెరిగింది. కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 53.40 అడుగులకు చేరింది.

కుక్కునూరు మండలం గుండేటి వాగు కాజ్వే పైకి వరద నీరు చేరుకోవడంతో దాచారం, గోమ్ముగూడెం పంచాయతీ పరిధిలోని దాదాపు పది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

వింజరం గ్రామంలోని పాలవాగు పొంగి ముత్యాలంపాడు వెళ్లే రోడ్డుపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉద్ధృతితో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి,రుద్రంకోట, రేపాక కొమ్ము గ్రామాలకు వెళ్లే రహదారిపైకి గోదావరి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఎద్దు వాగు పెద్దవాగు మేళ్ల వాగు మొండి కాలవలోకి గోదావరి వరద నీరు చేరడంతో మండల కేంద్రమైన వేలేరుపాడు నుంచి కన్నాయిగుట్ట, తిరుమలపురం, కోయిదా,కట్కూరు, కాక్కిసనూరు, టేకుపల్లి,టేకురు, పేరంటాలపల్లి,కాచారం పంచాయతీల పరిధిలోని 15 ఏజెన్సీ గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో నిత్యావసర సరుకుల కోసం పడవల సహాయంతో ఎద్దువాగు దాటి వచ్చి నిత్యావసర సరుకులు తీసుకుని గిరిజనులు వెళ్తున్నారు. గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో రాకపోకల స్తంభించడంతో భయం గుప్పెట్లో గిరిజనులు కాలం గడుపుతున్నారు.

వరద ముంపును ఎదుర్కోవడానికి అధికారులు అప్రమత్తమయ్యారు.

పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలను అప్రమత్తం చేశారు, వరద ముంపు ప్రభావిత ప్రాంతాలకు పునరావాస సరుకులను సరఫరా చేస్తున్నారు.

వరదలు తీవ్రతరం కావచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.

జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లాలో కంట్రోల్ రూమ్ ల ఎర్పాటు

గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లాలో కంట్రోల్ రూమ్ ల ఎర్పాటు చేశారు.ఈ కంట్రోల్ రూమ్ లు 24/7 అందుబాటులో ఉంటాయి. వరద బాధితులు ఈ కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చు.

కంట్రోల్ రూమ్ ల నంబర్లు:

కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 1800 233 1077

జంగారడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్: 9553220254

కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్: 7013128597,9848590546

వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్: 6309254781

Tags:    

Similar News