PRC fitment: 11వ పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌ ముట్టడి

PRC fitment: ఉద్యోగులపై జగన్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఫ్యాప్టో ఆగ్రహం

Update: 2022-01-20 07:57 GMT

PRC Fitment: 11వ పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించారు. జగన్ ప్రభుత్వం ప్రకటించిన అసంబద్ధ పీఆర్సీ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఫ్యాప్టో నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్‌లో ఉద్యోగులందరూ సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఫ్యాప్టో నేతలు హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్‌ ముట్టడికి జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు తరలివచ్చారు.

వీరి ఆందోళనలకు సచివాలయ ఉద్యోగులు, సీఐటీయూ, ఏఐటీయూసీ వంటి ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమని మండిపడ్డారు. పీఆర్సి విషయంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఉద్యోగులంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News