మాజీ సీఎం జగన్ పోలీసులు చెప్పినా వెనక్కి తగ్గట్లేదు. అవాంతరాలు ఎదురవుతాయి, ప్రజల ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించినా అస్సలు తగ్గట్లేదు. నేను ఇంతే మా దారి ఇంతే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నేడు నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీ లను మాజీ సీఎం జగన్ సందర్శించనున్నారు. దాని తర్వాత ఓ రోడ్ షో ప్లాన్ చేశారు. ఈ రోడ్ షో ద్వారానే ఇప్పుడు ఇబ్బందులు రాబోతున్నాయి. ఎందుకంటే విశాఖలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికా తో ఇండియా ఆడబోతుంది. కాబట్టి శాంతి భద్రతలను దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇలాంటి టైంలో జగన్ రోడ్ షో నిర్వహిస్తే కావాల్సినంత బందోబస్తు మేము ఏర్పాటు చేయలేమని పోలీసులు ముందే హెచ్చరించారు. విజయ్ కరూర్ ర్యాలీలో మొన్ననే 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన దేశాన్ని కుదిపేసింది. కాబట్టి జగన్ పర్యటన వల్ల ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే విశాఖలోని ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్న టైంలో ఏదీ జరగొద్దని ఉద్దేశంతో పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ జగన్ మాత్రం వెనకడుగు వేయట్లేదు. అటు వైసిపి నేతలు ప్రెస్ మీట్ లు పెట్టి.. ఎట్టి పరిస్థితుల్లో జగన్ రోడ్ షో ఉంటుందని.. పోలీసుల ఆంక్షలతో తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా దాన్ని కూటమి ప్రభుత్వం పైకి లేదా పోలీసులపైకి నెట్టివేయడం వైసిపికి అలవాటే కదా. పోలీసులు వద్దని చెబుతున్నా రోడ్ షో చేయడం ఏంటి. ప్రజల ప్రాణాలు అంటే అంత లెక్కలేని తనమా పని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
ఆ మధ్య రోడ్ షో చేసినప్పుడు జగన్ కారు కింద పడి ఓ కార్యకర్త చనిపోయాడు. కానీ దాన్ని కవర్ చేయడానికి కారు కింద కార్యకర్తలేడని రకరకాల వీడియోలు క్రియేట్ చేశారు. మసి బూసి మారేడు కాయను చేయాలని ప్రయత్నించారు వైసిపి నేతలు. చివరకు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఇలాంటివి ఎన్ని జరిగినా సరే వైసీపీ నేతలు, జగన్ తీరు మారట్లేదు. ఇప్పుడు విశాఖకు అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. అమరావతికి, రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇంత కీలకమైన టైంలో శాంతిభద్రతలు సరిగా లేవనే ఇంటిమేషన్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా.. అసలే వైసిపి హయాంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు మళ్లీ అదే వైసిపి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే పరిస్థితి ఏంటి అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నర్సీపట్నంకు వచ్చి అట్నుంచి అటే వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కానీ అడ్డు వస్తే ఊరుకునేది లేదన్నట్టు వైసీపీ నేతలు హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ఇలాంటి విపరీత ధోరణి ప్రజాస్వామ్యంలో మంచిది కాదంటున్నారు సామాన్య ప్రజలు.