APPSC : ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌ పదవీకాలం పొడిగింపు.. ఉత్తర్వులు జారీ...

Update: 2025-09-15 10:46 GMT

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్‌పర్సన్ ఏఆర్ అనురాధ పదవీకాలం మరో నెల రోజుల పాటు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఆమె పదవీ విరమణ గురించి వస్తున్న వార్తలకు తెరదించుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అనురాధ వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏపీపీఎస్సీని పారదర్శకంగా, సమర్ధవంతంగా నడిపించేందుకు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా... అనుభవం ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను గతేడాది అక్టోబర్ 23న ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నెల రోజుల పాటు ఆమె పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Tags:    

Similar News