Road Accident : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: ఒక్కరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..
తిరుపతి జిల్లా పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై తొండవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన భక్తులు తిరుమల దర్శనం అనంతరం అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో విజయవాడకు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు చిత్తూరు నుంచి తిరుపతి వైపుగా వెళ్తున్న పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.