Konaseema District : కొడుకు, బిడ్డను కాలువలో పడేసి తండ్రి పరార్!

Update: 2025-03-18 12:00 GMT

ఏపీ రాష్ట్రం కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల్ని కాలువలో పడేసి ఓ తండ్రి పరారయ్యాడు. నాలుగు రోజుల క్రితం కాకినాడలో ఇద్దరు పిల్లల్ని కర్కశంగా చంపిన ఘటన మరువక ముందే రామచంద్రపురం మండలం నెలపర్తిపాడులో ఈ దారుణం జరిగింది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను కాలువలో పడేశాడు. కుమారుడు సందీప్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కుమార్తె మాత్రం మృతి చెందింది. కాలువలో ఆరేళ్ల చిన్నారి కారుణ్య మృతదేహం లభ్యమైంది. పిల్లి రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు చనిపోయాడా లేక పిల్లల్ని కాలువలో పడేసి పరారయ్యాడా అనే కోణంలో ఆరా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పిల్లి రాజు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News