Nellore: క్షుద్రపూజల పేరుతో తండ్రి దారుణం.. ప్రమాదంలో కూతురి ప్రాణం..

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది.;

Update: 2022-06-15 14:45 GMT

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రపూజల పేరుతో పసిపాపను హింసించిన ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉండే వేణు, యామిని దంపతులకు పదేళ్ల తర్వాత ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. గత మూడు రోజులుగా వీరు మాంత్రికుడి సహాయంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో శాంతిపూజలు నిర్వహించారు.

వేణు తన బిడ్డను కాళ్లమీద పడుకోబెట్టి.. నోట్లో కుంకుమ పోస్తూ పూజలు చేశాడు. గొంతులో కుంకుమ పోస్తుండటంతో చిన్నారి గట్టిగా ఏడ్వటంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని నిలదీసి.. పాపను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేణును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News