Tirupati: రెండేళ్ల చిన్నారి డెడ్‌బాడీని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి..
Tirupati: రెండేళ్ల చిన్నారి డెడ్‌బాడీని తీసుకేళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో బైక్‌పై తీసుకెళ్లాడు ఓ తండ్రి.;
Tirupati: తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. రెండేళ్ల చిన్నారి డెడ్‌బాడీని తీసుకేళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో బైక్‌పై తీసుకెళ్లాడు ఓ తండ్రి. దొరవారిసత్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రెండేళ్ల అక్షయ గ్రావెల్ గుంతలో పడింది. ఐతే చిన్నారిని నాయుడుపేట హాస్పిటల్‌కు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది.
దీంతో డెడ్‌బాడీని స్వగ్రామం తీసుకెళ్లేందుకు 108 సిబ్బందిని సంప్రదించాడు చిన్నారి తండ్రి. ఐతే డెడ్‌బాడీని తరలించేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ నిరాకరించారు 108 సిబ్బంది. నాయుడుపేట నుంచి కొత్తపల్లికి డెడ్‌బాడీని తరలించేందుకు ఆటో వాళ్లను బతిమిలాడిన ముందుకురాలేదు. ఐతే ప్రైవేట్ అంబులెన్స్‌లో తరలించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో బైక్‌పైనే డెడ్‌బాడీని తరలించాడు ఆ తండ్రి.