Student Commits Suicide : ఇంటర్ రిజల్ట్స్ భయం.. విద్యార్థి ఆత్మహత్య

Update: 2025-04-12 08:45 GMT

నంద్యాల జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి(18) ఇటీవల ఫస్టియర్ ఎగ్జామ్స్ రాశాడు. రేపు ఫలితాలు రానుండగా, ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఉరివేసుకున్నాడు. గది నుంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా.. అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల ఫలితాలు ముఖ్యం కాదని, జీవితం ముఖ్యమని.. ఎవరూ ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకోకూడదని పోలీసులు విద్యార్థులకు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News