అంతుచిక్కని ఘటన..ఇళ్లలో నుంచి మంటలు..!
Fire Accident: కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది.;
కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ఇళ్లలో ఉన్నట్టుండి మంటలు చెలరేగుతున్నాయి. గత మూడు రోజులుగా.. మూడు ఇళ్లల్లో ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. మంటల వ్యాప్తితో ఇళ్లలోని సామాగ్రి తగలబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లలోనూ మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఏంచేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. మంటలకు కారణం దెయ్యాల పనా లేకా దేవుడి మహిమా అని గ్రామస్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు