కాకినాడ ఆర్టీసీ ఇంద్ర బస్సులో మంటలు..
ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఇంద్ర ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంద్ర బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.;
ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఇంద్ర ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంద్ర బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాకినాడ బస్టాండ్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను దింపేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రయాణ సమయంలో బస్సులో 15 మంది ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఎటువంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.