East Godavari : బస్సులో సీట్ల కింద ఐదు కోట్లు.. సీజ్‌ చేసిన పోలీసులు..!

East Godavari : పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ ప్లాజా వద్ద భారీగా నగదు పట్టుబడింది.

Update: 2022-04-01 16:15 GMT

East Godavari : పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ ప్లాజా వద్ద భారీగా నగదు పట్టుబడింది. పద్మావతి ట్రావెల్‌ బస్సులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 4 కోట్ల 76 లక్షల రూపాయలను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. నగదుతోపాటు 350 గ్రాముల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సును పోలీసుల తనిఖీలు చేయగా.. ప్యాసింజర్‌ సీట్ల కింద లగేజ్ క్యారియర్ బ్యాగులో డబ్బును పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరుకు బంగారం కొనుగోలుచేసేందుకు నగదు తరలిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. డబ్బును ఇన్‌కమ్ ట్యాక్సీ అధికారులకు అప్పగించి, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక తూర్పుగోదావరిజిల్లా లోను భారీఎత్తున నగదు, బంగారం పట్టుబడింది. కృష్ణవరం టోల్ ప్లాజావద్ద పద్మావతి ట్రావెల్స్‌ను తనిఖీచేయగా 5కోట్ల నగదు, 10 కేజీల బంగారాన్ని పోలీసులు సీజ్‌చేశారు. విజయవాడనుంచి వైజాగ్ వెలుతున్న బస్సులో పది కేజీల బంగారం పట్టుబడగా.. వైజాగ్‌ నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో 5కోట్ల 6లక్షలనగదు పట్టుకున్నారు.దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

Full View


Tags:    

Similar News