మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి కింగ్స్ కాలేజ్ లండన్ లో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సులో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్ లండన్ నుంచి బెంగళూరు మీదుగా ఏపీకి తిరిగి వస్తారు.