అమరావతిని, టీడీపీని అంతం చేయడానికి జగన్ కుట్రలు..!
అమరావతిని, టీడీపీని అంతం చేయడానికి కుట్రలు చేస్తున్న జగన్.. ప్రజా రాజధానిని ఇంచ్ కూడా కదపలేరని, టీడీపీ జెండాలో పోగు కూడా పీకలేరని కామెంట్ చేశారు.;
అమరావతిని, టీడీపీని అంతం చేయడానికి కుట్రలు చేస్తున్న జగన్.. ప్రజా రాజధానిని ఇంచ్ కూడా కదపలేరని, టీడీపీ జెండాలో పోగు కూడా పీకలేరని కామెంట్ చేశారు మాజీ మంత్రి జవహర్. ఆర్థిక ఉగ్రవాది అవినీతి కళ్లకు లోకమంతా అలాగే కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్లు దోపిడీ చేసి జైలుకెళ్లిన జగన్.. రాజకీయ ప్రత్యర్థులను జైలుకి పంపాలనే కక్షతో చంద్రబాబుకి సీఐడీతో నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తేల్చినా, మళ్లీ అదే అంశం తెరపైకి తెచ్చారని విమర్శించారు.