Andhra Pradesh : మాజీ మంత్రి రోజా అబద్దాలు.. సీఎం చంద్రబాబుకు పోటీ ఉందా..!
మాజీ మంత్రి రోజా చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చి పనిగట్టుకుని అబద్దాలు ఆడేశారు. పాపం ఆమెకు కూటమి మీద ఎలా బురదజల్లాలో తెలియక ఏదో ఒకటి అనేద్దాం లే అన్నట్టు మీడియా ముందుకొచ్చినట్టు కనిపించింది. నగరికి సీఎం చంద్రబాబు ఎలా వస్తారని.. ఆయన నగరికి చేసిందేమీ లేదంటూ ఇలా రకరకాల మాటలు మాట్లాడింది రోజా. తల్లికి వందనం పథకంలో కేవలం ఆరు వేలు, ఏడు వేలే వేస్తున్నారని.. పసలేని ఆరోపణలు చేసింది రోజా. కానీ ఆమెకు ఏపీలో ఏం జరుగుతుందో బహుషా తెలిసనట్టు లేదు. ఎందుకంటే డైరెక్టుగా అకౌంట్లలోనే ప్రజలకు తల్లికి వందనం డబ్బులు పడిపోతున్నాయి కదా.
ఆ మాత్రం తెలియకుండా రోజా ఎలా మాట్లాడారు. పైగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ కూటమి డబ్బు కొడుతోందని.. సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అయిందంటూ రోజా సినిమా డైలాగులు పేల్చారు. ఓడిపోయినప్పటి నుంచి ప్రజల మధ్యకు రావడానికే ఇంట్రెస్ట్ చూపించని రోజాకు ప్రజలకు ఏమేం పథకాలు అందుతున్నాయో కూడా తెలియదని ఆమె మాటలను బట్టి అర్థమైపోయింది. నగరికి సీఎం చంద్రబాబు ఏం చేయలేదని చెప్పడం నిజంగా ఆమె అవివేకానికి నిదర్శం.
నగరికి సీఎం చంద్రబాబు ఎంతో చేశారని అందరికీ తెలుసు. 100 పడకల ఆస్పత్రి అభివృద్ధి చేయడం, రోడ్లు, స్కూళ్లను నిర్మించడం దగ్గరి నుంచి నీళ్లు తీసుకురావడం దాకా.. సీఎం చంద్రబాబు హయాంలోనే జరిగాయి. కానీ అవన్నీ దాచిపెట్టి రోజా ఇలా పసలేని అబద్ధాలు ఆడింది. ఇంకో విషయం ఏంటంటే మాజీ సీఎం జగన్ తనతో సీఎం చంద్రబాబు పోటీ పడలేకపోతున్నారంటూ మాట్లాడారు. నిజమే మరి.. జగన్ చేసిన అరాచకాలతో, అక్రమాలతో సీఎం చంద్రబాబు పోటీ పడలేదు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి.. ప్రపంచ స్థాయి పెట్టుబడులను తీసుకొచ్చి బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికే చంద్రబాబు పోటీ పడ్డారు. ఆ విషయంలో చంద్రబాబు దారి దాపుల్లో కూడా జగన్ ఉండదు అనేది వాస్తవం.