AP : జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే పులపర్తి?

Update: 2024-03-08 06:11 GMT

భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరబోతున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెండు మూడు రోజుల్లో పార్టీలో చేరుతానని తెలిపారు. కాగా 2009, 2014లో భీమవరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

కాగా భీమవరం టికెట్ పులపర్తికి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చెయ్యకపోతే తనకు అవకాశమివ్వాలని పులపర్తి కోరుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ఇక్కడినుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ పై ఓడిపోయారు. కాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రామాంజనేయులు వియ్యంకుడు.

Tags:    

Similar News