AP : బ్యాలెట్ ఓట్లు పెడితేనే పోటీ చేస్తా.. పొద్దుటూరు శివప్రసాద్ రెడ్డి కీలక నిర్ణయం
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇకపై జరిగే ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని.. లేనిపక్షంలో తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఈవియం ల ద్వారా అక్రమంగా గెలిచింది తప్ప.. ప్రజాభిప్రాయం మేరకు గెలవలేదన్నారు. ఇప్పటికిప్పుడు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే వైసిపి 130 నుంచి 140 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.