వైపీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నరెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు సంబంధింన కేసులో నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయలో అనిల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అదే వేదికపైనే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. గత నెల 26న విచారణకు హాజరు కావాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ విచారణకు హాజరయ్యారు.
ఇదే కేసులో ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు మరో ముగ్గురిని పోలీసులు విచారించారు. ఇక అనిల్ కుమార్ విచారణకు హాజరవుతున్నారన్న వార్తతో డీఎస్పీ కార్యాలయం దగ్గరకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కేసులో అనిల్ ఏ2 గా ఉన్నారు