Andhra Pradesh : పోలీసుల విచారణకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

Update: 2025-07-25 09:15 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. నెల్లూరు డీఎస్పీ ఆఫీసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసులో రెండు రోజుల క్రితం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసరావు టీమ్ ప్రసన్నకుమార్‌రెడ్డిని విచారించనుంది. మహిళా ఎమ్మెల్యేపై అసభ్య వ్యాఖ్యలకు సంబంధించి అతనిపై కోవూరు పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News