AP Free Bus Scheme : ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. కండిషన్స్ అప్లై

Update: 2024-12-31 05:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. తెలుగు ప్రజల కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లయినా, రోజుకు ఎంత దూరం ప్రయాణించినా టికెట్‌ కొనాల్సిన అవసరం ఉండదు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు.. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్‌, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సీఎంకు వివరించారు అధికారులు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పథకాన్ని ఇప్పటికే అమలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలని అధికారులకు సూచించారు. APSRTC ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో సరాసరి 69 శాతం వరకూ ఉందని, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఉచిత ప్రయాణం అమలుతో ప్రభుత్వంపై ప్రతి నెలా 265 కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు అధికారులు.

Tags:    

Similar News