AP: ఏపీ రాజధానిపై మళ్లీ జగన్ కుట్రలు

అమరావతికి చట్టబద్ధత వేళ కుట్రలకు తెర...నదీ గర్భంలో అమరావతి అంటూ వ్యాఖ్యలు.. సుప్రీం పరిగణనలోకి తీసుకోవాలన్న జగన్... అసలు రాజధాని అనే పదమే లేదన్న జగన్

Update: 2026-01-09 04:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­కీ­యా­ల్లో రా­జ­ధా­ని అమ­రా­వ­తి అంశం మరో­సా­రి వే­డె­క్కిం­ది. గత కొ­న్ని రో­జు­లు­గా వై­సీ­పీ అధి­నేత, మాజీ ము­ఖ్య­మం­త్రి వై­ఎ­స్ జగన్ మో­హ­న్ రె­డ్డి చే­సిన వ్యా­ఖ్య­లు రా­జ­కీయ వర్గా­ల్లో­నే కా­కుం­డా ప్ర­జ­ల్లో­నూ చర్చ­నీ­యాం­శం­గా మా­రా­యి. ము­ఖ్యం­గా అమ­రా­వ­తి­కి చట్ట­బ­ద్ధత కల్పిం­చే ప్ర­క్రి­య­లు ముం­దు­కు సా­గు­తు­న్న వేళ, ఆయన చే­సిన వ్యా­ఖ్య­లు వి­వా­దా­ని­కి దారి తీ­శా­యి. ఒక­ప్పు­డు స్వా­గ­తిం­చిన రా­జ­ధా­ని­పై ఇప్పు­డు ప్ర­శ్న­లు లే­వ­నె­త్త­డం ద్వా­రా జగన్ రా­జ­కీయ వై­ఖ­రి­పై వి­మ­ర్శ­లు వె­ల్లు­వె­త్తు­తు­న్నా­యి. తా­జా­గా తా­డే­ప­ల్లి­లో­ని వై­సీ­పీ కేం­ద్ర కా­ర్యా­ల­యం­లో ని­ర్వ­హిం­చిన మీ­డి­యా సమా­వే­శం­లో వై­ఎ­స్ జగన్ అమ­రా­వ­తి రా­జ­ధా­ని­పై తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు. నదీ­గ­ర్భ ప్రాం­తం­లో రా­జ­ధా­ని ని­ర్మా­ణం జరు­గు­తోం­ద­ని ఆరో­పిం­చిన ఆయన, ఇలాం­టి అం­శా­న్ని సు­ప్రీం­కో­ర్టు పరి­గ­ణ­లో­కి తీ­సు­కో­వా­ల­న్నా­రు. రా­జ­ధా­ని అనే పదా­ని­కే స్ప­ష్టత లే­ద­ని, సీఎం ఎక్కడ కూ­ర్చుం­టే అదే రా­జ­ధా­ని అనే తన అభి­ప్రా­యా­న్ని మరో­సా­రి పు­న­రు­ద్ఘా­టిం­చా­రు. నదీ గర్భం­లో భవన ని­ర్మా­ణా­ల­కు అను­మ­తు­లు ఉం­డ­వ­ని చె­బు­తూ, అలాం­ట­ప్పు­డు రా­జ­ధా­ని ని­ర్మా­ణం ఎలా సా­ధ్య­మ­ని ప్ర­శ్నిం­చా­రు. రహ­దా­రు­లు, తా­గు­నీ­రు, వి­ద్యు­త్ వంటి మౌ­లిక వస­తు­లు లేని ప్రాం­తం­లో రా­జ­ధా­ని అంటూ వ్యం­గ్యం­గా వ్యా­ఖ్యా­ని­స్తూ అమ­రా­వ­తి­ని ‘సో కా­ల్డ్ క్యా­పి­ట­ల్’గా అభి­వ­ర్ణిం­చా­రు.

ఈ వ్యా­ఖ్య­లు వె­లు­వ­డిన వెం­ట­నే రా­జ­కీయ వర్గా­ల్లో తీ­వ్ర స్పం­దన వచ్చిం­ది. ము­ఖ్యం­గా గతం­లో అమ­రా­వ­తి­పై భి­న్న­మైన అభి­ప్రా­యా­లు వ్య­క్తం చే­సిన వై­సీ­పీ నేతల మా­ట­ల­కు ఇవి పూ­ర్తి వి­రు­ద్ధం­గా ఉం­డ­టం­తో వి­మ­ర్శ­లు మరింత పె­రి­గా­యి. కొ­ద్ది రో­జుల క్రి­త­మే వై­ఎ­స్ జగన్ రా­జ­కీయ కా­ర్య­ద­ర్శి సజ్జల రా­మ­కృ­ష్ణా­రె­డ్డి, అమ­రా­వ­తి రా­జ­ధా­ని­గా ఉం­డ­డం­పై తమకు అభ్యం­త­రం లే­ద­ని ప్ర­క­టిం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. అలాం­టి ప్ర­క­టన తర్వాత జగన్ చే­సిన వ్యా­ఖ్య­లు పా­ర్టీ వై­ఖ­రి­లో స్ప­ష్ట­త­లే­మి­ని చూ­పి­స్తు­న్నా­య­నే అభి­ప్రా­యం వ్య­క్త­మ­వు­తోం­ది. అమ­రా­వ­తి రా­జ­ధా­ని ప్ర­యా­ణం వె­నుక ఉన్న చరి­త్ర­ను పరి­శీ­లి­స్తే రా­జ­కీయ మలు­పు­లు స్ప­ష్టం­గా కని­పి­స్తా­యి. 2014లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వి­భ­జ­న­తో రా­ష్ట్రం రా­జ­ధా­ని లే­కుం­డా మి­గి­లి­పో­యిం­ది. అదే ఏడా­ది జరి­గిన ఎన్ని­క­ల్లో చం­ద్ర­బా­బు నే­తృ­త్వం­లో­ని ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిం­ది.

కొ­త్త రా­జ­ధా­ని కోసం రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా వి­స్తృ­తం­గా పరి­శీ­ల­న­లు జరి­పి, చి­వ­ర­కు గుం­టూ­రు జి­ల్లా తా­డి­కొండ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని తూ­ళ్లూ­రు మం­డ­లం పరి­ధి­లో­ని 28 గ్రా­మా­ల­ను కలు­పు­కు­ని అమ­రా­వ­తి­ని రా­జ­ధా­ని­గా ప్ర­క­టిం­చా­రు. ఈ ని­ర్ణ­యా­న్ని అప్ప­టి ప్ర­తి­ప­క్ష నే­త­గా ఉన్న వై­ఎ­స్ జగన్ ఆం­ధ్ర­ప్ర­దే­శ్ శా­స­న­స­భ­లో స్వా­గ­తి­స్తూ ప్ర­క­టన చే­య­డం అప్ప­ట్లో వి­శే­షం­గా చర్చ­కు వచ్చిం­ది. రా­జ­ధా­ని ని­ర్మా­ణా­ని­కి సం­బం­ధిం­చి ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర మోదీ చే­తుల మీ­దు­గా శం­కు­స్థా­పన కా­ర్య­క్ర­మం ఘనం­గా జరి­గిం­ది. అమ­రా­వ­తి­లో భవ­నాల ని­ర్మా­ణా­లు, మౌ­లిక సదు­పా­యాల ఏర్పా­టు­కు శ్రీ­కా­రం చు­ట్టా­రు. ఈ దశ­లో­నే మరో­సా­రి అసెం­బ్లీ ఎన్ని­క­లు వచ్చా­యి. 2019 ఎన్ని­క­ల్లో ప్ర­జ­లు వై­సీ­పీ­కి స్ప­ష్ట­మైన మె­జా­రి­టీ ఇచ్చా­రు. దాం­తో వై­ఎ­స్ జగన్ ము­ఖ్య­మం­త్రి­గా బా­ధ్య­త­లు స్వీ­క­రిం­చా­రు. అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత పరి­పా­లన వి­కేం­ద్రీ­క­రణ అనే ని­నా­దం­తో జగన్ ప్ర­భు­త్వం మూడు రా­జ­ధా­నుల ప్ర­తి­పా­ద­న­ను ముం­దు­కు తె­చ్చిం­ది. శాసన రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి, న్యాయ రా­జ­ధా­ని­గా కర్నూ­లు, పరి­పా­లన రా­జ­ధా­ని­గా వి­శా­ఖ­ప­ట్నం అనే ప్ర­క­టన రా­జ­కీ­యం­గా పె­ద్ద చర్చ­కు దారి తీ­సిం­ది. ఈ ని­ర్ణ­యం అమ­రా­వ­తి­కి భూ­ము­లు ఇచ్చిన రై­తు­ల్లో తీ­వ్ర ఆం­దో­ళ­న­ను రే­పిం­ది. తమ భవి­ష్య­త్తు అని­శ్చి­తి­లో పడిం­దం­టూ వారు ఉద్యమ బాట పట్టా­రు.

రై­తు­లు నాటి నుం­చి ఆం­దో­ళ­న­లు, ని­ర­స­న­లు, దీ­క్ష­లు చే­ప­ట్టా­రు. న్యా­య­స్థా­నం నుం­చి దే­వ­స్థా­నం వరకు, అమ­రా­వ­తి నుం­చి అర­స­వ­ల్లి వరకు పా­ద­యా­త్ర­ల­కు ప్ర­య­త్నిం­చా­రు. మొ­ద­ట్లో అను­మ­తు­లు ని­రా­క­రిం­చి­నా, చి­వ­ర­కు న్యా­య­స్థా­నాల జో­క్యం­తో అను­మ­తు­లు లభిం­చా­యి. అయి­న­ప్ప­టి­కీ అడు­గ­డు­గు­నా పో­లీ­సు నిఘా, ఆం­క్ష­ల­తో రై­తు­లు అనేక ఇబ్బం­దు­లు ఎదు­ర్కొ­న్నా­రు. మరో­వై­పు మూడు రా­జ­ధా­ను­లు­గా ప్ర­క­టిం­చిన ప్రాం­తా­ల్లో ఒక్క ఇటుక కూడా వే­య­లే­ద­న్న వి­మ­ర్శ­లు ప్ర­భు­త్వం ఎదు­ర్కొం­ది. ఇదే సమ­యం­లో ప్ర­తి­ప­క్ష నే­త­ల­పై కే­సు­లు, అరె­స్టు­లు, జైలు పా­ల­య్యే పరి­స్థి­తు­లు చో­టు­చే­సు­కో­వ­డం ద్వా­రా జగన్ పా­ల­న­పై ప్ర­జ­ల్లో అసం­తృ­ప్తి పె­రి­గిం­ది. ఈ నే­ప­థ్యం­తో­నే 2024 ఎన్ని­క­లు వచ్చా­యి. తె­లు­గు­దే­శం పా­ర్టీ, జన­సేన పా­ర్టీ, భా­ర­తీయ జనతా పా­ర్టీ కలి­సి కూ­ట­మి­గా పోటీ చే­శా­యి. ఫలి­తా­ల్లో కూ­ట­మి­కి 164 సీ­ట్లు దక్క­గా, వై­సీ­పీ కే­వ­లం 11 సీ­ట్ల­కే పరి­మి­త­మైం­ది. ప్ర­తి­ప­క్ష హోదా కూడా దక్క­ని పరి­స్థి­తి ఏర్ప­డిం­ది.

Tags:    

Similar News